వికారాబాద్ జిల్లా పుడూర్ మండలం పెద్దఉమ్మెంతాల్ గ్రామం లో కొలువైన పాత ఆంజనేయ స్వామి దేవాలయం 7 దశాబ్ధాల కు పైగా చరిత్ర కలిగిన దేవాలయం. స్వామి వారు ఎంతో శక్తివంతమైన స్వామిగా ప్రసిద్ధి గాంచారు..కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం స్వామి. స్వామి వారికి ప్రతినిత్యం జరిగే పూజా కార్యక్రమాలతో పాటు మంగళవారం, శనివారం విశేషామైన సేవలు నిర్వహించబడుతాయి. హనుమాన్ జయంతి,శ్రీరామ నవమి మరియు పండుగ పర్వదినాలలో విశేషామైన పూజలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం.ప్రశాంతమైన వాతావరణం లో కొలువై ఉన్న క్షేత్రమిది.